జల వివాదాలన్నీ ఒకే ట్రిబ్యునల్‌కు!

0
24

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ:అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కారానికి వేర్వేరుగా ఉన్న ట్రిబ్యునళ్ళన్నింటినీ రద్దు చేసి శాశ్వత ప్రాతిపదికన పనిచేసే ఒకే ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది. కేంద్ర మంత్రివర్గం బుధవారం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ముసాయిదా బిల్లును జనవరిలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశపెడుతారు. దేశంలో జలవివాదాలను వేగంగా పరిష్కరించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కింద దేశంలో ఎనిమిది ట్రిబ్యునల్‌లు ఏర్పాటయ్యాయి. ప్రస్తుత విధానంలో ఒక ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించడానికి దశాబ్దాల సమయం పడుతున్నది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here