జల్లికట్టు ఆందోళనలో సంఘ విద్రోహశక్తులు

0
15

తమిళనాడులో జల్లికట్టు కోసం విద్యార్థులు సోమవారం చేసిన ఆందోళనలో సంఘ విద్రోహశక్తులు చొరబడ్డాయని తమిళనాడు సీఎం పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. మెరీనా బీచ్‌లో విద్యార్థుల ఆందోళనలో విద్రోహశక్తులు కలిశాయని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలుగకూడదనే టియర్ గ్యాస్ ప్రయోగించి.. లాఠీచార్జీ చేయాల్సి వచ్చిందని వివరించారు. శుక్రవారం తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత స్టాలిన్ అడిగిన ప్రశ్నకు సీఎం పన్నీర్ సెల్వం సమాధానం ఇచ్చారు. మెరీనా బీచ్‌లో కొందరు అల్‌కాయిదా వ్యవస్థాపకుడు, ఒసామా బిన్ లాడెన్ ఫొటోలున్న బ్యానర్లు ప్రదర్శించారని పన్నీర్ సెల్వం చెప్పారు. దీనికి సంబంధించిన ఫొటోలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. మరికొందరు ప్రత్యేక తమిళనాడు కావాలని డిమాండ్ చేశారని.. ఇంకొందరు గణతంత్ర దినోత్సవాన్ని బహిష్కరించాలని నినాదాలు చేశారని వివరించారు.

LEAVE A REPLY