జల్లికట్టులో ఇద్దరు మృతి..129మందికి గాయాలు

0
16

జల్లికట్టును నిర్వహించిన తొలి రోజే అపశృతి చోటు చేసుకుంది. పుదుకొైట్టె జిల్లాలోని రాపూసల్ గ్రామంలో జల్లికట్టు ఆడుతుండగా ఇద్దరు మృతి చెందారు. మరో 129మందికిపైగా గాయాలయ్యాయి. జట్టు క్రీడలో పాల్గొంటుండగా జరిగిన ప్రమాదంలో రాజా(30), మోహన్ (30)మృతి చెందారు. 150కిపైగా ఎద్దులతో మూడున్నరగంటలు జల్లికట్టును నిర్వహించిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అధికారులు గాయాలయిన వారిని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారని మంత్రి సీ విజయ భాస్కర్ తెలిపారు. మొత్తం 5వేల మందికి పైగా జల్లికట్టు ఆటను తిలకించేందుకు వచ్చినట్లు మంత్రి తెలిపారు.

LEAVE A REPLY