జయలలిత మాట్లాడుతున్నారు..

0
23

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాట్లాడగలుగుతున్నారని, గొంతు చికిత్స జరిగిన కారణం గా కొద్దిసేపు స్పీకర్‌ను వినియోగిస్తున్నారని అపో లో హాస్పిటల్స్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పారు. అమె అన్ని అవయవాలు సాధారణంగా పనిచేస్తున్నాయన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆమె గొంతులో శ్వాసనాళానికి ట్యూబ్ అమర్చామని, 90శాతం మేరకు సొంతంగా ఆమె శ్వాస తీసుకుంటున్నారని అన్నారు. తాత్కాలికంగా ఆమె స్పీకర్ సాయంతో మాట్లాడుతున్నారని గొంతు చికిత్స జరిగినందున త్వరలో ఆమె పూర్తిస్థాయిలో మాట్లాడతారని వెల్లడించారు. ఆరు, ఏడు వారాలుగా ఒకేచోట చికిత్స అందిస్తున్నందున ఆమెకు సాధారణ స్థితికి చేరుకోవడానికి మరో వార్డుకు తరలించినట్టు తెలిపారు.

LEAVE A REPLY