జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు

0
18

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో జరిగే అంత్యక్రియలకు ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, పొన్‌రాధాకృష్ణన్‌లు నియమితులయ్యారు. సాయంత్రం 4.30గం.కు చెన్నై మెరీనాబీచ్‌లో ఆమె పార్థివదేహానికి అంత్యక్రియలు జరగనున్నాయి. తమిళ ప్రజలు ‘అమ్మ’గా పిలుచుకునే జయలలితను కడసారి చూసేందుకు ప్రజలు రాజాజీహాల్‌ వద్దకు భారీగా చేరుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, పలువురు కేంద్ర మంత్రులు, సినీ, రాజకీయ ప్రముఖులు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ ‘అమ్మ’ను కడసారి చూసేందుకు తమిళ ప్రజలు వేలాది తరలివస్తున్నారు. ముఖ్యంగా అభిమానులు, పార్టీ కార్యకర్తలు అశ్రు నయనాలతోనే జయలలితకు నివాళులర్పిస్తున్నారు.

LEAVE A REPLY