జపాన్‌లో భారీ వర్షం… 15 మంది మృతి!

0
14

జపాన్‌లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా భారీగా వరదలు పొటెత్తుతున్నాయి. శనివారం వరదల తాకిడికి సుమారు 15 మంది మృతిచెందగా, మరో 50 మంది వరకు గాయపడ్డారని సమాచారం. హిరోషిమా, ఎహిమి, యమగుచి నగరాల్లో భారీగా కురుస్తున్న వర్షానికి జనజీవనం అస్తవ్యస్తంగా మారిందని అక్కడి స్థానిక మీడియా పేర్కొంది. దీంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదిస్తున్నారు. వరద నీరు ముంచెత్తడంతో లోతట్టు ప్రాంతాలు జలశయాలను తలపిస్తున్నాయి. దీంతో మిలిటరీ బృందాలు రంగంలోకి దిగి లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. హిరోషిమాలో కొండచరియలు విడిపడటంతో రవాణ వ్యవస్థ దెబ్బతింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here