జన్మదినాన అనంతకు సీఎం

0
17

ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం (ఏప్రిల్‌ 20న) తన జన్మదినం రోజున అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. 68వ ఏట అడుగుపెడుతున్న ఆయన.. తన పుట్టినరోజును ప్రజల మధ్యన జరుపుకోవాలని… అదీ నీటి సంరక్షణకు సంబంధించిన సందేశాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్లే కార్యక్రమంలో పాల్గొనాలని నిర్ణయించారు. నీటి సంరక్షణ పనుల ప్రారంభం, పరిశీలనకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నీటి వినియోగసంఘాలు, నీటి సంరక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్న రైతులు, తదితరులతో సమావేశమవుతారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి లోకేశ్‌ కూడా పాల్గొంటారు

LEAVE A REPLY