జనవరి 11 వరకు శాసనసభ సమావేశాలు

0
30

హైదరాబాద్: జనవరి 11వ తేదీ వరకు శాసనసభ సమావేశాలు కొనసాగనున్నాయి. సభాపతి మధుసూదనాచారి ఆధ్వర్యంలో స్పీకర్ ఛాంబర్‌లో జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ భేటీకి సీఎం కేసీఆర్, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రులు హరీశ్‌రావు, ఈటల రాజేందర్, ప్రతిపక్ష సభ్యులు జానారెడ్డి, అక్బరుద్ధీన్, కిషన్‌రెడ్డి, సున్నం రాజయ్యలు హాజరై సభా సమావేశాలపై చర్చించారు. జనవరి 3,4,5,6,9,11 తేదీల్లో సభా సమావేశాలు నిర్వహించాలని బీఏసీ నిర్ణయం తీసుకుంది. జనవరి 6 వరకు సభలో చర్చించాల్సిన అంశాలను మొదటగా ఖరారు చేశారు. జనవరి 3న మత్స్య సంపద అభివృద్ధి అంశం, 4న బోధన రుసుములపై, 5న సింగరేణి, 6వ తేదీన ఎస్సీ, ఎస్టీల ఆర్థిక స్థితిగతులపై చర్చను చేపట్టనున్నారు.

LEAVE A REPLY