జనవరి 1 నుంచి ఫ్లెక్సీలు బంద్‌

0
29

వచ్చే జనవరి 1 నుంచి గోడలపై రాతలు, ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పురపాలన, పట్టణాభివృద్ధి మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. ఉల్లంఘనకు పాల్పడిన వారిలో అధికార పక్షం వారుంటే తొలి కేసు వారిపైనే నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా, చెత్త వేసినా.. జరిమానా విధించే మెజిస్టీరియల్‌ అధికారాలు డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్లకు కల్పిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌ అభివృద్ధి ప్రణాళికలు- పౌర సమస్యల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలు – మౌలిక వసతుల కల్పనపై గురువారం మంత్రి కేటీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో జరిగిన ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, మంత్రులు నాయిని, పద్మారావు, తలసానితో పాటు, నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. గ్రేటర్‌లో నాలాలపై ఆక్రమణలను ఏకపక్షంగా తొలగించకుండా.. ప్రత్యామ్నాయ ఇంజనీరింగ్‌ అంశాలను పరిశీలిస్తామని సమీక్ష అనంతరం మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు.

LEAVE A REPLY