జనంలో కంటే వాటి చుట్టూ తిరిగేదే ఎక్కువ అలవికాని హామీలను నమ్మొద్దు

0
7

‘వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ది కోర్టుల పాదయాత్ర. పాదయాత్ర పేరుతో ఆయన ప్రజల మధ్య కంటే న్యాయస్థానాల చుట్టూ తిరగడమే ఎక్కువ. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవడం కోసం వైసీపీ అలవికాని హామీలెన్నో ఇస్తోంది. అవన్నీ నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లే’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన తీరుపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపిచ్చారు. వైసీపీ, బీజేపీ కలిసి నాటకాలాడుతున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మంగళవారం చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం సారవకోటలో పర్యటించారు. రూ.180 కోట్లతో నిర్మించనున్న బొంతు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు.

LEAVE A REPLY