జతగా.. జెట్‌ స్పీడుతో

0
28

యాషెస్‌ టు యాషెస్‌, డస్ట్‌ టు డస్ట్‌, ఒకవేళ లిల్లీ నిన్ను అవుట్‌ చేయకపోతే, థామో కచ్చితంగా చేస్తాడు’. గతంలో జంటగా ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టిన ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లు డెన్నిస్‌ లిల్లీ, జెఫ్‌ థామ్సన్‌ (థామో)పై వచ్చిన పద్యం చాలా పాపులర్‌. ఇప్పుడది మన స్పిన్‌ ద్వయం రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాలకు అతికినట్టు సరిపోతుంది. ‘యాషెస్‌ టు యాషెస్‌, డస్ట్‌ టు డస్ట్‌, ఒకవేళ వాళ్ల బౌలింగ్‌లో నువ్వు దొరక్కపోతే, బ్యాటింగ్‌లో కచ్చితంగా చిక్కుతావు’ అని పాడుకోవచ్చు. ఎందుకంటే అశ్విన్‌-జడేజా బంతితో ప్రత్యర్థిని దెబ్బ తీయడమే కాదు.. బ్యాటింగ్‌లో చెలరేగుతూ వారికి మరింత సవాల్‌ విసురుతున్నారు. తమ ఆల్‌రౌండ్‌ ప్రతిభతో ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారిపోయారు. ఇంగ్లండ్‌తో సిరీ్‌సలో ఈ జంట దూసుకెళ్తున్న విధానం ముచ్చటగొలుపుతోంది. ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా జరిగిన మూడు మ్యాచ్‌ల్లో వీరిద్దరూ కలిపి 35 సగటుతో 387 పరుగులు చేశారు. అందులో ఐదు అర్ధశతక భాగస్వామ్యాలు ఉన్నాయి. ఇవన్నీ జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు చేసినవే. ఈ మూడు టెస్టుల్లో ఇంగ్లండ్‌ కోల్పోయిన 53 వికెట్లలో ఈ జంటవే 25 వికెట్లంటే వాళ్లు ఎంతగా మాయ చేస్తున్నారో చెప్పొచ్చు. మొహాలీ తొలి ఇన్నింగ్స్‌లో 204/6 స్కోరుతో జట్టు కష్టాల్లో పడ్డ దశలో ఎంతో సహనం, పట్టుదలతో ఆడిన అశ్విన్‌-జడేజా ఏడో వికెట్‌కు 97 పరుగులు జోడించి భారతకు ఆధిక్యం దక్కేలా చేశారు. ఆపై, జయంత యాదవ్‌తో 90 పరుగులు జోడించిన జడేజా మ్యాచ్‌ను ఏకపక్షం చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here