జగన్ అందుకే నాపై కక్ష పెంచుకున్నాడు

0
28
విజయవాడను రాజధానిగా ప్రకటించినప్పుడు తాను బల్లలపై కొట్టినందుకే జగన్ కక్షపెట్టుకున్నాడని ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ దుయ్యబట్టారు. వైఎస్‌ చేయలేని పనిని చంద్రబాబు పూర్తి చేశారన్నారు. పులివెందులలో వైఎస్‌ కుటుంబం రక్తం కారిస్తే చంద్రబాబు నీళ్లు పారిస్తున్నారని చెప్పారు. ఆరు నెలలుగా జగన్ పనిపాటా లేకుండా తిరుగుతున్నాడు. చంద్రబాబుపై పదేపదే నోరుపారుసుకుంటూ బంగాళాఖాతంలో కలిపేస్తానని అవాకులు చవాకులు పేలుతున్నాడు. ప్రజలే జగనని నల్లసముద్రంలో కలిపేస్తారని టీడీపీ నేతలు విమర్శించారు. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ బుధవారం స్టేట్‌ గెస్ట్‌ హౌస్‌లో విలేకరులతో మాట్లాడారు.
పట్టిసీమ పూర్తి చేయటం వల్ల 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టా బతికి బట్టకట్టింది. నాడు కాంగ్రెస్‌లో ఉండగా పట్టిసీమను ఏడాదిలో పూర్తి చేస్తే 500 కార్లు పెట్టి చంద్రబాబును ఊరేగిస్తానని చెప్పాను. అలాగే ఆయన పట్టిసీమను పూర్తి చేశారు’ అని దేవినేని నెహ్రూ అన్నారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ఎవరైనా చేస్తారని, వాటిని పూర్తి చేయటమే ప్రధాన ఆశయమని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ కమిషన్ కోసం జల యజ్ఞానికి, ప్రభుత్వ పథకాలకు కేవీపీ ఓ దళారిగా పని చేశాడన్నారు. సమావేశంలో టీడీపీ నేతలు కడియాల బుచ్చిబాబు, ఫ్లోర్‌లీడర్‌ జి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY