జగన్‌పై విరుచుకు పడ్డ మంత్రి ఉమ

0
23

వైఎస్‌ జగన్‌పై మంత్రి దేవినేని ఉమ విరుచుకుపడ్డారు. ఇవాళ విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేయడానికే సమావేశాలు నిర్వహిస్తున్నారని, జైలుకెళ్లి వచ్చినా జగన్‌‌లో ఎలాంటి మార్పు రాలేదన్నారు. 11 సీబీఐ కేసుల్లో ఏ-1గా ఉన్న వ్యక్తి ప్రభుత్వాన్ని విమర్శించడం విడ్డూరమన్నారు. విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌ ప్రవర్తను అందరూ చూశారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా జగన్‌ కుట్ర చేశారని మండిపడ్డారు. రాష్ట్రం అభివృద్ధి చెందడం జగన్‌కు ఇష్టం లేదని ఉమ పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here