జగన్‌ను ప్రజలు తరిమికొడతారు: సతీష్ రెడ్డి

0
38

జగన్‌ ప్రాజెక్టులకు ఆటంకాలు సృష్టిస్తే జనం తరిమికొడతారని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ సతీష్ రెడ్డి హెచ్చరించారు. పులివెందులలో 40 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వబోతున్నామని సతీష్ రెడ్డి అన్నారు. దోచుకోవడానికే వైఎస్ హయాంలో పోలవరం కాలువలు తవ్వారని ఆయన ఆరోపించారు. ఎవరైనా ముందు హెడ్ వర్క్స్ చేసి, తర్వాత కాల్వలు తవ్వుతారని సతీష్ రెడ్డి తెలిపారు. అన్నీ ప్రాజెక్టులు ఎన్టీఆర్ హయాంలో ప్రారంభమయ్యాయని.. ఇప్పుడు చంద్రబాబు హయాంలో పూర్తవుతున్నాయని ఏపీ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ సతీష్ రెడ్డి అన్నారు.

LEAVE A REPLY