‘జగన్‌ను నమ్మితే… బిర్యానీ కాదు చిప్పకూడే’

0
38
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమార్జన చేసి నేర పరిశోధన సంస్థలకు దొరికిపోయి ఐఏఎస్‌, ఐపీఎస్‌, పారిశ్రామిక వేత్తలను తనతో పాటు జైలుకు పంపించిన ఘనత జగన్‌దే. సొంత తల్లిపై పోటీ చేసిన చిన్నాన్నను ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిపి బిర్యానీ పెడతా… నాలుగు రెట్ల సంపాదన చూపిస్తానంటూ అమాయకులైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను వంచించేందుకు జగన్‌ జిల్లాలో పర్యటించారని దానిని గ్రహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి అన్నారు. జగన్‌ను నమ్మితే బిర్యాని కాదు కదా జైలు చిప్పకూడు తినిపిస్తారని ఆరోపించారు.
పైడిపాళెంకు నీరొచ్చాక తెలంగాణ వదిలి నింపాదిగా కడప జిల్లాకు వచ్చి ప్రాజెక్టు వద్దకు వెళ్ళి మా తండ్రి పూర్తి చేశారని జగన్‌ చెప్పడం హాస్యాస్పదమని, ఇటువంటి ప్రతిపక్ష నేత జిల్లా వాసి కావడం ప్రజల దౌర్భాగ్యమని మండిపడ్డారు. ఆయన సోమవారం టీడీపీ జిల్లా కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడారు. ఈ ఎన్నికలలో ఆయన చిన్నాన్న ఓడిపోవడం తధ్యమని గ్రహించి స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులతో రెండేళ్ళల్లో ముఖ్యమంత్రి అవుతానని అప్పుడు నాలుగు రెట్ల సంపాదన చూపిస్తానని చెబుతూ వారిని అన్యాయం చేసేందుకు కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
నీటి పారుదల అభివృద్ధి బోర్డు సమావేశాలకుకానీ, చివరకు జిల్లా పరిషత్‌ సమావేశాలకు కూడా హాజరు కాని జగన్‌ నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. వాస్తవాలు ప్రజలకు బాగా తెలుసునని, ముఖ్యంగా ప్రాజెక్టులకు నీరు ఎవరి ద్వారా వస్తున్నాయో పులివెందుల ప్రజలకు మరింత తెలుసునని చెప్పారు. చంద్రబాబు వల్లే పులివెందులకు సాగు నీరు వస్తున్న సంగతి ముమ్మాటికీ వాస్తవమని తెలుసుకున్న ప్రజలు జగన్‌ పార్టీని భూస్థాపితం చేస్తారన్నారు. ఈ సమావేశంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.హరిప్రసాద్‌, ఓబులవారిపల్లె జడ్పీటీసీ సభ్యుడు ఎన్‌.రమణ, కార్పొరేటర్లు విశ్వనాధరెడ్డి, ఆదినారాయణ టీడీపీ జిల్లా ప్రచార కార్యదర్శి జిలానీబాష, కార్యాలయం కార్యదర్శి వెంకటశివారెడ్డి, టీడీపీ నేతలు యాటగిరి రాంప్రసాద్‌, పిచ్చియ్య, శ్రీధర్‌రెడ్డి, ఆసం నరసింహారెడ్డి, నిజామ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here