చైర్‌లో వస్తువులు..చేతులపై రోగులు

0
11

సర్కారీ ఆసుపత్రుల్లో ట్రాలీలు, వీల్‌చైర్లు, స్ట్రెట్చర్ల కొరత పట్టిపీడిస్తోంది. కేజీహెచ్‌లో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. అరకొరగా ఉన్న వాటిని సిబ్బంది మందులు, గోనె సంచులు, చెత్తబుట్టలు, ఆక్సిజన్‌ సిలిండర్లు తరలించేందుకు వినియోగిస్తున్నారు. దీంతో అత్యవసర సమయంలో రోగులను వారి వారి బంధువులు చేతులమీద, వీపుపై ఎక్కించుకుని తీసుకువెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.

అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పాటు అవసరమైన పరికరాలు లేకపోవడంతో రోగుల పాట్లు వర్ణనాతీతంగా ఉన్నాయి. వార్డు నుంచి లేదా ఓపీ నుంచి నడవలేని వ్యక్తిని ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం ఎక్స్‌రే, స్కానింగ్‌లకు తీసుకువెళ్లేందుకు రోగి సహాయకులు నానాపాట్లు పడుతున్నారు. అధికారులు తగిన చర్యలు తీసుకుని రోగులకు ముందుగా సహాయం అందిలే చూడాలని పలువురు కోరుతున్నారు

LEAVE A REPLY