చైనా హెచ్చరికలు భారత్ బేఖాతరు

0
27

బౌద్ధ మతగురువు దలైలామా అరుణాచల్ పర్యటన విషయంలో చైనా హెచ్చరికలను భారత్ బేఖాతరు చేయాలని తీర్మానించుకుంది. సంప్రదాయానికి భిన్నంగా కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు దలైలామా పర్యటనలో పాల్గొంటారని వెల్లడైంది. వచ్చేనెల 4వ తేదీ నుంచి 13వ తేదీవరకు అరుణాచల్‌లోని తవాంగ్ బౌద్ధరామంలో దలైలామా బసచేయనున్నారు. అరుణాచల్‌కు చెందిన కేంద్రమంత్రి రిజిజు ఆ సందర్భంగా తవాంగ్‌కు వెళ్లి దలైలామాతో సమావేశం కానున్నట్టు చెప్పారు. ఓ మతనాయకునిగా దలైలామా అరుణాచల్ వెళ్తున్నారు. ఆయనను ఆపాల్సిన అవసరం ఏదీ లేదు. భక్తులు రమ్మని పోరుపెడుతున్నారు. ఆయన వల్ల ఏం ప్రమాదం వస్తుంది? ఆయన కేవలం లామా మాత్రమే అని రిజిజు అన్నారు.

తవాంగ్ ఇచ్చి అక్సాయ్‌చిన్ తీసుకోండి

భారత, చైనా దేశాల మధ్య ప్రాదేశిక తగాదాలకు చైనా అధికారి దాయ్ బింగువో వింత పరిష్కారం సూచించారు. అరుణాచల్‌లోని తవాంగ్ చైనాకు ఇచ్చేస్తే చైనా అందుకు బదులుగా అక్సాయ్‌చిన్ ప్రాంతాన్ని అప్పగిస్తుందని బింగువో అన్నారు.

LEAVE A REPLY