చైనా మ‌రోసారి త‌న భార‌త్ వ్య‌తిరేక బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది

0
40

బీజింగ్‌: చైనా మ‌రోసారి త‌న భార‌త్ వ్య‌తిరేక బుద్ధిని బ‌య‌ట‌పెట్టుకుంది. త‌న చిర‌కాల మిత్రుడు పాకిస్థాన్‌కు కొమ్ముకాసింది. నిషేధిత ఉగ్ర‌వాద సంస్థ జైషే మ‌హ్మ‌ద్ చీఫ్ మ‌సూద్ అజ‌ర్‌పై నిషేధం విధించాల‌న్న భార‌త్ డిమాండ్‌ను మ‌రోసారి అడ్డుకుంది. ఇప్ప‌టికే రెండుసార్లు ఏవో సాకులు చెప్పి మ‌సూద్‌పై నిషేధం ప‌డ‌కుండా కాపాడిన చైనా.. తాజాగా శుక్ర‌వారం త‌న వీటో ప‌వ‌ర్ ఉప‌యోగించడం గ‌మ‌నార్హం. ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న పోరులో చైనా ద్వంద్వ నీతికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని భార‌త విదేశాంగ శాఖ ఘాటుగా స్పందించింది. ఐక్య‌రాజ్య‌స‌మితి అల్‌ఖైదా ఇస్లామిక్ స్టేట్ బ్లాక్‌లిస్ట్‌లో మ‌సూద్ అజ‌ర్ పేరును చేర్చాల‌న్న భార‌త్ డిమాండ్‌ను మొద‌ట ఏప్రిల్‌లో చైనా పెండింగ్‌లో పెట్టింది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్‌లో సాంకేతిక కార‌ణాలు చూపుతూ.. డిసెంబ‌ర్ 31 వ‌ర‌కు నిషేధం విధించ‌కుండా అడ్డుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here