చైనాకు ద‌డ పుట్టిస్తున్న పాక్ ఉగ్ర‌వాదులు

0
30

ఆ పాకిస్థాన్ వ‌ల్ల ప్ర‌పంచానికే ముప్పు ఉంద‌ని తెలిసినా.. దాన్ని నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్న చైనాకు మెల్ల‌మెల్ల‌గా త‌త్వం బోధ‌ప‌డుతున్న‌ట్లుంది. ఆ దేశం ఉగ్ర‌వాదుల త‌యారీ కేంద్ర‌మ‌ని తెలిసినా.. త‌న శ‌త్రువుకు శ‌త్రువు కాబ‌ట్టి.. ఇన్నాళ్లూ వెన‌కేసుకొచ్చిన చైనా త‌న‌దాకా వ‌చ్చేసరికి జాగ్ర‌త్త ప‌డుతోంది. పాక్ బోర్డ‌ర్‌కు ద‌గ్గ‌ర‌గా ఉన్న జిన్‌జియాంగ్ ప్రావిన్స్ ప్ర‌భుత్వం.. భ‌ద్ర‌త‌ను మ‌రింత క‌ట్టుదిట్టం చేయాల‌ని నిర్ణయించింది. పాక్ నుంచి ఉగ్ర‌వాదుల వ‌ల‌స‌లు త‌మ ప్రాంతంలోకి ఎక్కువ‌వుతున్నాయ‌ని భావించిన అక్క‌డి ప్ర‌భుత్వం.. అవ‌స‌ర‌మైతే స‌రిహ‌ద్దును మూసేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు జినువా న్యూస్ వెల్ల‌డించింది.

త‌మ ప్రాంతంలోకి ఉగ్ర‌వాదుల చొర‌బాటును అడ్డుకోలేక‌పోతున్న పాక్‌పై చైనా అసంతృప్తిగా ఉంది. పాకిస్థాన్‌, ఆఫ్ఘ‌నిస్థాన్‌ల‌లో శిక్ష‌ణ తీసుకున్న ఉగ్ర‌వాదులు త‌మ ప్రాంతంలోకి చొర‌బ‌డి దాడుల‌కు పాల్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని జిన్‌జియాంగ్ క‌మ్యూనిస్ట్ పార్టీ నేత‌లు భ‌య‌ప‌డుతున్నారు. జిన్‌జియాంగ్‌లోని హోటన్ ప్రాంతంలో ఆదివారం జ‌రిపిన సోదాల్లో ముగ్గురు ఉగ్ర‌వాదుల‌ను భ‌ద్ర‌తా సిబ్బంది కాల్చి చంపారు. డిసెంబ‌ర్ 28న ఇదే ప్రాంతంలో ఉగ్ర‌వాదుల దాడిలో ఐదుగురు చ‌నిపోవ‌డంతో భ‌ద్ర‌తా సిబ్బంది ఈ సోదాలు నిర్వ‌హించి వారిని మ‌ట్టుబెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here