చే సమాధి వద్దకు చేరిన కాస్ట్రో చితాభస్మం

0
23

శాంటాక్లారా: క్యూబా విప్లవవీరుడు ఫిడెల్ కాస్ట్రో చితాభస్మం ఆయన ఉద్యమ సహచరుడు చేగువేరా సమాధిని చేరింది. హవానాలో రెండురోజుల శ్రద్ధాంజలి అనంతరం కాస్ట్రో చితాభస్మం ఊరేగింపు బుధవారం ప్రారంభమైంది. వేల సంఖ్యలో రోడ్లపైకి వచ్చిన క్యూబన్లు తమ నేతకు వీడ్కోలు పలికారు. నేనే ఫిడెల్ అని వారు నినాదాలు చేశారు.
కాస్ట్రో చితాభస్మం ఉన్న పాత్రను ఒక అద్దాలపెట్టెలో ఉంచి, దానిపై క్యూబా జాతీయ జెండాను కప్పి ఊరేగించారు. గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత ఆ చితాభస్మం శాంటాక్లారాలోని గువెరా సమాధి, మ్యూజియం ఉన్న సముదాయంలోకి చేరింది. ఇది క్యూబాతోపాటు మానవాళి చరిత్రను మార్చివేసిన ఇద్దరు కమాండెంట్ల చారిత్రక సమావేశం అని ఓ వైద్య విద్యార్థి వ్యాఖ్యానించారు. చితాభస్మం ఊరేగింపు పలు పట్టణాల మీదుగా ఆదివారం శాంటియాగో డి క్యూబాకు చేరుకుంటుంది. అక్కడ 19వ శతాబ్దపు స్వాతంత్య్ర వీరుడు జోస్ మార్టి సమాధి పక్కన కాస్ట్రో చితాభస్మాన్ని ఖననం చేస్తారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు హోం మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలోని బృందం క్యూబా చేరుకున్నది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here