చేరికలతో నిత్యకల్యాణం, పచ్చతోరణంలా తెలంగాణభవన్: కేటీఆర్

0
11

కేటీఆర్ గులాబీ కండువాకప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు సీఎం కేసీఆర్‌తో, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కొల్లాపూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి భేటీ అయ్యారు. అనంతరం ఒక ప్రకటన విడుదలచేస్తూ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుపై నమ్మకం, విశ్వాసం, నియోజకవర్గ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. మరోవైపు మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ కోశాధికారి జూపల్లి భాస్కర్‌రావు కేటీఆర్, మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణభవన్‌లో చేరికల సందర్భంగా జరిగిన సభల్లో కేటీఆర్ మాట్లాడుతూ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలు దేశవ్యాప్తంగా అమలుకావాలంటే గులాబీ సైనికులు పార్లమెంట్‌లో ఉండాలన్నారు. ఎర్రకోట మీద జాతీయజెండా ఎవరు ఎగురవేయాలనేది తెలంగాణ నిర్ణయించేలా తీర్పు ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రజలను కేటీఆర్ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here