చేనేత వస్ర్తాలను వారానికొకసారైనా ధరించాలని ప్రజాప్రతినిధులకు కేటీఆర్ పిలుపు

0
17

తెలంగాణ: రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులందరూ వారానికి ఒకసారి చేనేత వస్ర్తాలు ధరించి చేనేత కార్మికులకు చేయూతనివ్వాలని రాష్ట్ర చేనేత, జౌళి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ లేఖ రాశారు. ప్రజాప్రతినిధులేకాకుండా వారి కార్యాలయాల్లో పనిచేసేవారిని కూడా చేనేత వస్ర్తాలు ధరించే విధంగా చూడాలని లేఖలో కోరారు. ఒకప్పుడు చేనేత పరిశ్రమ ఉండేదట అని భవిష్యత్ తరాలు అనుకునే పరిస్థితి రాకుండా చూడాలన్నారు.

LEAVE A REPLY