చేనేతకు మీ చొరవ గ్రేట్!

0
25

చేనేత రంగానికి చేయూతనివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ప్రశంసించారు. ప్రభుత్వ ఉద్యోగులంతా వారంలో ఒక రోజు చేనేత దుస్తులనే ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. తాను కూడా వ్యక్తిగతంగా ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఆమె గుర్తుచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం స్మృతిఇరానీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా… చేనేతను ప్రోత్సహించటానికి రాష్ట్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తెలియజేశారు. మరోవైపు, జౌళిరంగం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన కేటీఆర్ మార్చి నెలలో హైదరాబాద్‌లో అంతర్జాతీయస్థాయిలో నిర్వహించబోయే జౌళి పెట్టుబడిదారుల శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా స్మృతిఇరానీని ఆహ్వానించారు. అందుకామె వస్తానంటూ హామీ ఇచ్చారు. ఈ వివరాల్ని కేటీఆర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జౌళి సదస్సు సందర్భంగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్లను ఆహ్వానించి ఫ్యాషన్ షోలు నిర్వహించి చేనేతకు ప్రచారం కల్పించాలంటూ స్మృతి ఇరానీ సూచించారని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here