చైతూ సినిమా షురూ

0
24

‘ప్రేమమ్‌’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన అక్కినేని నాగచైతన్య పరిణితి చెందిన నటనతో మంచి మార్కులే వేయించుకున్నాడు. ప్రస్తుతం ఆయన కల్యాణ్‌ కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం లాంఛనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు ఎస్‌.ఎస్‌.రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు, కీరవాణి తదితరులు హాజరయ్యారు.

నాగచైతన్య తన ట్విట్టర్‌ ఖాతా ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. వారాహి చలన చిత్రం పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి కథానాయికగా నటిస్తున్నారు. శ్రీకాంత్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 21న నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here