చెలరేగిన డివిలియర్స్, మొయిన్‌

0
18

శక్తివంచన లేకుండా చివరి వరకు పోరాడినా హైదరాబాద్‌ లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. ప్లే ఆఫ్స్‌ పరుగులో రాయల్‌ చాలెంజర్స్‌కు మరో కీలక విజయం దక్కింది. గురువారం రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ఏబీ డివిలియర్స్‌ (39 బంతుల్లో 69; 12 ఫోర్లు, 1 సిక్స్‌), మొయిన్‌ అలీ (34 బంతుల్లో 65; 2 ఫోర్లు, 6 సిక్స్‌లు) అద్భుత భాగస్వామ్యం, గ్రాండ్‌హోమ్‌ (17 బంతుల్లో 40; 1 ఫోర్, 4 సిక్స్‌లు), సర్ఫరాజ్‌ ఖాన్‌ (8 బంతుల్లో 22 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ల మెరుపు ఇన్నింగ్స్‌లతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. అనంతరం కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (42 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), మనీశ్‌ పాండే (38 బంతుల్లో 62 నాటౌట్‌; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) కడవరకు పోరాడినా సన్‌రైజర్స్‌ 3 వికెట్లు కోల్పోయి 204 పరుగులు మాత్రమే చేయగలిగింది. చివరి ఓవర్లో 20 పరుగులు అవసరం కాగా మొదటి బంతికే విలియమ్సన్‌ అవుట్‌ కావడం దెబ్బతీసింది. చివరి ఓవర్‌లో ఐదు పరుగులే రావడంతో బెంగళూరు 14 పరుగులతో విజయం సాధించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here