చెరోదారిలో సీపీఎం, సీపీఐ

0
19

రాష్ట్రంలో సీపీఎం, సీపీఐ మధ్య సయోధ్యపై ఇరుపార్టీల ముఖ్య నేతల్లో తర్జనభర్జన జరుగుతోంది. పార్టీల రాజకీయ తీర్మానాల్లో సారూప్యత ఉన్నా.. నాయకులు చెరోదారిలో నడుస్తుండటంతో కలసి పని చేయడంపై సందేహం వ్యక్తమవుతోంది. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోడానికి వామపక్ష పార్టీలతోపాటు సర్కారుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ లను సమీకరించాలని, కానీ రెండు పార్టీల మధ్యే ఐక్యత కొరవడిందంటూ నేతలు వాపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో రెండు ఎర్రజెండాలు పరస్పరం పోటీపడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. ‘ఎర్ర’పార్టీల మధ్య సయోధ్య కుదరకపోవడానికి సీపీఎం కారణమంటూ సీపీఐ నేతలు, సీపీఐ నేతల వ్యవహారశైలే కారణమని సీపీఎం నేతలు ఒకరిపైఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

LEAVE A REPLY