చెన్నై వైపు మళ్లుతున్న ‘వర్ద’

0
33

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘వర్ధ’ తుపాను క్రమంగా తన దిశను మార్చుకుంటోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో… నైరుతి దిశను ఆనుకుని కేంద్రీకృతమై ఉంది. ప్రస్తుతం ఇది చెన్నైకి తూర్పు దిశగా 440 కిలోమీటర్లు, నెల్లూరుకు తూర్పు ఆగ్నేయంగా 490 కి.మీల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తుపాను రేపు మధ్యాహ్నం చెన్నై సమీపంలో తీరం దాటనున్నట్లు అంచనా వేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి అతి తీవ్ర తుపాను బలహీనపడే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కోస్తాంధ్రకు ఈరోజు సాయంత్రం నుంచి 36 గంటల పాటు వర్ష సూచన ప్రకటించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40-50 కి.మీల వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటే సమయంలో గాలుల తీవ్రత 80-90 కి.మీలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ముందు జాగ్రత్తగా కృష్ణపట్నం పోర్టులో ఆరో నంబర్‌, మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో మూడో నంబర్‌, విశాఖ, గంగవరం, కాకినాడ పోర్టుల్లో రెండో ప్రమాద హెచ్చరిక జారీచేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here