చెన్నై ఓపెన్‌ ఫైనల్లో బోపన్న-జీవన్‌

0
23

రోహన్‌ బోపన్న, జీవన్‌ నెదుంచెజియన్‌ జంట చెన్నై ఓపెన్‌ డబుల్స్‌ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీఫైనల్లో ఈ జోడీ 7-6 (3), 6-4తో నిక్‌ మొన్రో (అమెరికా), అర్తెమ్‌ సిటాక్‌ (న్యూజిలాండ్‌) ద్వయంపై గెలిచింది. ఫైనల్లో బోపన్న-జీవన్‌ జంట భారత్‌కే చెందిన పురవ్‌ రాజా-దివిజ్‌ శరణ్‌ జోడీని ఢీకొంటుంది. ఏటీపీ వరల్డ్‌ టూర్‌ ఈవెంట్‌ ఫైనల్లో రెండు భారత జంటలు తలపడడం ఇదే తొలిసారి. సింగిల్స్‌లో రెండో సీడ్‌ రాబర్టో బౌటిస్టా అగట్‌ (స్పెయిన్‌), మెద్వెదెవ్‌ (రష్యా) ఫైనల్‌కు చేరుకున్నారు. సెమీఫైనల్లో అగట్‌ 6-3, 6-3తో బెనాయిట్‌ పైరె (ఫ్రాన్స్‌)పై, మెద్వెదెవ్‌ 4-6, 7-6 (2), 6-2తో డుడి సెలా (ఇజ్రాయెల్‌)పై గెలిచారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here