చెత్తనుబహిరంగంగా కాలిస్తే జరిమానా

0
18

బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులబెట్టడంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) సంపూర్ణ నిషేధం ప్రకటించింది. వ్యర్థ పదార్థాలను గుట్టలుగాపోసి బహిరంగంగా తగులబెడితే రూ.25 వేలు జరిమానా విధించాలని ఆదేశాలు జారీచేసింది. చెత్తను పోగుచేసే డంపింగ్ యార్డుతో సహా బహిరంగ ప్రదేశాల్లో చెత్తను తగులపెట్టడంపై సంపూర్ణ నిషేధం విధించాలని మేం ఆదేశిస్తున్నాం. అలాంటి ఉల్లంఘనలకు పాల్పడేవారికి, కొద్దిమొత్తంలో చెత్త తగులబెడితే రూ.5 వేల చొప్పున, భారీస్థాయిలో చెత్తను తగులబెడితే రూ.25 వేల చొప్పున జరిమానా విధించాల్సి ఉంటుంది అని ఎన్జీటీ చైర్మన్ స్వతంతర్‌కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు చెప్పింది. సదరు ఘటనలకు బాధ్యులైన నిర్వాహకులు లేదా సంస్థ నుంచి ఆ మొత్తాన్ని పర్యావరణ పరిహారంగా వసూలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది

LEAVE A REPLY