చిన్న నిర్మాతలు లాభపడేలా..

0
14

పెద్ద సినిమాలకు సులభంగా థియేటర్లు దొరుకుతున్నాయి. వారం రోజుల్లోనే పెట్టిన పెట్టుబడి తిరిగివస్తున్నది. కానీ చిన్న సినిమా నిర్మాతలు మాత్రం థియేటర్లు దొరక్క, డిస్ట్రిబ్యూటర్లు ముందుకురాక అనేక కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ప్రతి చిన్న సినిమా నిర్మాత లాభపడేలా చర్యలు చేపడుతున్నది అని అన్నారు శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్ తెలిపారు. అర్జున్, జె.డి.చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం కాంట్రాక్ట్. ఎస్.ఎస్.సమీర్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర మోషన్ పోస్టర్‌ను గురువారం హైదరాబాద్‌లో స్వామిగౌడ్, ప్రతాని రామకృష్ణగౌడ్ ఆవిష్కరించారు. టైటిల్‌లోగోను అర్జున్ విడుదలచేశారు. ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్‌లో సినీ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారు అని పేర్కొన్నారు. చిత్రసీమలో అడుగుపెట్టి 30 ఏళ్లయింది. మా పల్లె గోపాలుడు సమయంలో నటనలో నాకు ఎలాంటి అనుభవం లేదు. దర్శకుడు కోడి రామకృష్ణను అనుకరించాను. ఆ రోజుల్లో సిక్స్‌ప్యాక్ ఒక్కటే నాకున్న క్వాలిఫికేషన్. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇన్నేళ్లు ఎలా గడిచాయా అనిపిస్తుంది అని అర్జున్ చెప్పారు.

LEAVE A REPLY