చిదంబరానికి మరోసారి ఊరట

0
8

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌నేత పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. ఆగస్టు1వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చెయ్యొద్దని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాల్సిందిగా చిదంబరం కోర్టును కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్‌ ఎ.కె.పాథక్ ఇందుకు అంగీకరించారు. దీనికి సంబంధించి ఎలాంటి అరెస్టు చేపట్టవద్దని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణకు ఆగస్టు 1కి వాయిదా వేశారు.

LEAVE A REPLY