చల్లని వాతావరణానికి 20 మంది మృతి

0
22

కాబూల్: మనుషుల్ని గడ్డకట్టించే వాతావరణం కారణంగా ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు ఆఫ్గనిస్థాన్ అధికారులు తెలిపారు. మృతి చెందినవారిలో చాలామంది ఉత్తర ఆఫ్గనిస్థాన్‌కు చెందిన వారని పేర్కొన్నారు. జాజ్వాన్ ప్రావిన్స్‌లోని దర్జాబ్ జిల్లాలో గత వారం రోజులుగా ఈ మరణాలు సంభవించినట్టు ప్రావిన్సియల్ పోలీస్ చీఫ్ రహమతుల్లా తుర్కిస్థానీ తెలిపారు. అరమీటరు మందంలో మంచు కురుస్తోందని, నేలపై రెండు అడుగుల మందం మంచు పేరుకుపోయిందని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో విద్యుత్ సౌకర్యం, వైద్య సేవలు అందడం లేదు. ఈ ప్రాంతాన్ని కలిపే రోడ్డు మార్గాన్ని తాలిబన్లు తవ్వేశారు. సహాయ కార్యక్రమాలకు వాతావరణం సహకరించడం లేదని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు జలాలాబాద్‌లో రోడ్డు పక్కన అమర్చిన బాంబు పేలడంతో ఓ పోలీసు, ఓ బాలుడు మృతి చెందాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here