చలికి 27 మంది ఆఫ్ఘన్ చిన్నారుల బలి

0
22

భారీ హిమపాతం, గడ్డకట్టించే చలి కారణంగా ఆఫ్ఘనిస్థాన్‌లో 27 మంది చిన్నారులు మృత్యువుపాలయ్యారని, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశమున్నదని ఆఫ్ఘన్ అధికారులు తెలిపారు. ఉత్తరాదిలోని జాజాన్ రాష్ర్టంలోని దర్జాబ్ జిల్లాలో గత రెండుమూడు రోజుల్లో ఈ మరణాలు సంభవించాయి. రహదారులు మంచుతో కప్పబడిన కారణంగా సహాయ కార్యక్రమాలకు అడ్డంకులు ఏర్పడుతున్నాయి. మృతులందరూ ఐదు సంవత్సరాల లోపువారేనని తెలుస్తున్నది. ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రతియేటా చలికాలంలో మంచు కారణంగా పెద్దసంఖ్యలో జనం.. ముఖ్యంగా పిల్లలు మరణిస్తుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here