చర్చ జరిగితేనే సమస్యలు తెలుస్తాయి

0
15

నోట్లరద్దు నిర్ణయం వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దేశానికి వెల్లడించటం కోసమే పార్లమెంటులో చర్చ జరుగాలని తాము కోరుకుంటున్నామని టీఆర్‌ఎస్ లోక్‌సభాపక్ష నేత జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. నోట్లరద్దు నిర్ణయాన్ని సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశంలో ప్రతిపార్టీ సమర్థించిందని, ఆ నిర్ణయం అమలవుతున్న తీరుపైనే పార్టీలు అభ్యంతరాలను వ్యక్తం చేశాయని గుర్తుచేశారు. లోక్‌సభలో చర్చ జరుగకుండా అడ్డంపడడం సభా సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. లోక్‌సభలో గురువారం జీరోఅవర్ సందర్భంగా 193వ నిబంధన కింద చర్చను ప్రారంభించాల్సిందిగా జితేందర్‌రెడ్డిని స్పీకర్ సుమిత్ర మహాజన్ ఆదేశించారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు జితేందర్‌రెడ్డి ప్రసంగానికి అడ్డం పడడమేగాక ఆయన వద్దకు వచ్చి ఆటంకాలు సృష్టించారు.

LEAVE A REPLY