చర్చలతో రామజన్మభూమి సమస్య పరిష్కారం

0
21

చర్చల ద్వారా రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదం తప్పకుండా పరిష్కారమవుతుందని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి బుధవారం అయోధ్యను సందర్శించారు. అక్కడి తాత్కాలిక రామమందిరంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు బీజేపీ అగ్రనేతలపై నేరపూరిత కుట్ర అభియోగాలను నమోదు చేసిన మరుసటిరోజే సీఎం యోగి ఆదిత్యనాథ్ అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించడం గమనార్హం. వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన రామజన్మభూమి న్యాస్ ట్రస్టు అధ్యక్షుడు, వీహెచ్‌పీ నేత మహంత్ నృత్య గోపాల్‌దాస్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ ఇరు మతాలకు చెందిన పెద్దలు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా రామజన్మభూమి సమస్యను పరిష్కరించుకోవచ్చునన్నారు. ఆతర్వాత సరయు నదీ తీరంలో సీఎం పూజలు చేశారు.

LEAVE A REPLY