చరిత్ర సృష్టిస్తున్న సింగరేణి

0
99

తెలంగాణ: బొగ్గు ఉత్పత్తిలో సింగరేణి సంస్థ సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. దక్షిణ భారత దేశానికి బొగ్గు సరఫరా చేయడంలో పెద్దన్న పాత్రను పోషిస్తూ సత్తా చాటుతున్నది. తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాల్లోని పరిశ్రమలకు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు, సిమెంట్ పరిశ్రమలకు.. ఇలా ఏ అవసరానికైనా సింగరేణి నుంచి వచ్చే బొగ్గే కీలకం. 1889లో సింగరేణి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించినప్పుడు 59వేల టన్నులు ఉత్పత్తి చేయగా.. 2015 నాటికి అది 60.38 మిలియన్ టన్నులకు చేరడం గమనార్హం. 2015లో 15 శాతం గ్రోత్‌రేట్ నమోదు చేసి, దేశంలోనే అత్యధిక వృద్ధి రేటును నమోదు చేసిన బొగ్గు కంపెనీగా సింగరేణి నిలిచింది.

2016-17 సంవత్సరంలో 58 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా రికార్డుస్థాయిలో 61.40 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేశారు. 58 మిలియన్ టన్నుల రవాణా లక్ష్యం కాగా.. 60.8 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేశారు. 2016-17లో 60.82 మిలియన్ టన్నుల బొగ్గును రవాణా చేయగా.. అందులో 50.65 మిలియన్ టన్నుల బొగ్గును అంటే 83 శాతం థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకే సరఫరా చేశారు. అదేవిధంగా 11.3 శాతం వృద్ధితో రూ. 18,389 కోట్ల టర్నోవర్‌ను చేరుకుంది. ఉద్యోగులకు ఇప్పటికే రూ.500 కోట్లకుపైగా బోనస్ ప్రకటించింది.

తెలంగాణ రాష్ట్రం రాగానే తెలంగాణ ఇంక్రిమెంట్ పేరుతో రూ.5.04 కోట్లను ప్రతినెలా వెచ్చిస్తున్నది. 2015-16లో సంస్థ 15 శాతం వృద్ధి సాధించడంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు లాభాల్లో 23 శాతం కార్మికులకు ఇవ్వాలని నిర్ణయించారు. గతంలో లాభాల్లో 18, 21శాతం ఇస్తే సీఎం కేసీఆర్ 23 శాతం ఇవ్వాలని ఆదేశించారు. ఆ మేరకు రూ.245.20 కోట్లు ఉద్యోగులకు వెళ్లాయి. దీపావళి బోనస్ కింద మరోసారి రూ. 302 కోట్లు ఇచ్చారు. మొత్తంగా 2015-16 సంత్సరంలో ఒక్కొక్క ఉద్యోగికి రూ.లక్ష వరకు బోనస్ రూపంలో దక్కాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here