చరణ్‌తో బన్నీ విలన్‌?

0
14

‘సరైనోడు’లో అల్లు అర్జున్‌ని ఢీ కొట్టే విలన్‌ పాత్రలో కనిపించాడు ఆది పినిశెట్టి. ఇప్పుడు రామ్‌చరణ్‌ సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నట్టు సమాచారం. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా మైత్రీ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. సుకుమార్‌ దర్శకుడు. ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో జగపతిబాబు కనిపించనున్నారు. ఇప్పుడు మరో పాత్ర కోసం ఆది పినిశెట్టిని ఎంచుకొన్నారని సమాచారం. ఇది కూడా విలన్‌ తరహా పాత్రా? లేదంటే పాజిటివ్‌గా సాగుతుందా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నారు. ఇటీవలే ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం అవుతుంది. ఈ సినిమా కోసం ‘పల్లెటూరి ప్రేమలు’ అనే పేరు పరిశీలిస్తున్నారట.

LEAVE A REPLY