చక్రబంధంలో బోర్డు

0
24

టన్నుల కొద్దీ టాలెంట్‌… అంతులేని ఆత్మవిశ్వాసం.. అడుగడుగునా.. విజయకాంక్ష.. ఇంకా ఏదో అందుకోవాలన్న కసితో రగిలే విరాట్‌ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడనడంలో ఎలాంటి సందేహం లేదు. గత ఐదేళ్లుగా అసాధారణ ఆటతో చెలరేగిపోతున్న కోహ్లీని చూస్తే బ్యాట్స్‌మన్‌గా అతని ప్రతిభ ఏపాటిదో ఇట్టే తెలిసిపోతుంది. కానీ, కోహ్లీ నాయకత్వ పటిమను తెలిపింది మాత్రం 2016 సంవత్సరమే. గతేడాది అనూహ్యంగా టెస్టు పగ్గాలు అందుకున్న విరాట్‌.. అందరి అంచనాలనూ తలకిందులు చేస్తూ జట్టును అద్భుతంగా నడిపిస్తున్నాడు. జట్టులో ఉన్న కొంత మంది నాణ్యమైన ఆటగాళ్లను తన మార్గనిర్దేశంతో విరాట్‌ కోహ్లీ ఇప్పుడు చాంపియన్లుగా మార్చేశాడు. విరాట్‌కు ఎల్లవేళలా అండగా ఉండే అశ్విన్‌ ఈ ప్రక్రియలో అతని వెన్నంటి నిలిచాడు. మైదానం బయట భారత క్రికెట్‌ ఈ ఏడాది అనేక గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా… విరాట్‌ జట్టును నడిపించిన తీరు అమోఘం. అద్భుత బ్యాటింగ్‌తో పాటు ప్రేరణ కలిగించే నాయకత్వంతో అతను టెస్టు జట్టును నెంబర్‌ వన్‌గా తయారు చేశాడు. బ్యాట్‌తో విరాట్‌ చెలరేగుతుంటే.. జట్టు తురుపు ముక్క.. నాయకుడి ప్రధాన ఆయుధమైన అశ్విన్‌ ప్రత్యర్థిపై విరుచుకుపడిపోయాడు..! సారథి అడిగిందే తడవుగా ఒకటికి రెండు వికెట్లు తీసిచ్చాడు. అడగకుండానే బ్యాట్‌తోనూ రాణించి సెంచరీలు బహుమతిగా ఇచ్చాడు.

LEAVE A REPLY