చంద్రుడి వయస్సు 451 కోట్ల ఏండ్లు

0
21

లాస్ ఏంజెల్స్: చంద్రుడి వయస్సు కనీసం 451 వందల కోట్లు ఉండవచ్చనే విషయాన్ని తాజా పరిశోధన వెల్లడించింది. గతంలో ఊహించిన దానికంటే 14 కోట్ల సంవత్సరాలు ఎక్కువ అని పేర్కొన్నది. ఈ పరిశోధనను అమెరికాలోని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకుల బృందం నిర్వహించింది. సౌర వ్యవస్థ అవతరించిన 6 కోట్ల ఏండ్ల లోపల చంద్రగ్రహం ఏర్పడి ఉండవచ్చనే అభిప్రాయాన్ని పరిశోధకులు వ్యక్తం చేశారు. 1971లో అపోలో అంతరిక్ష యాత్ర సందర్భంగా చంద్రుడి ఉపరితలంపై వ్యోమగాములు సేకరించిన జిర్కాన్స్ అనే ఖనిజం, శిలలు, మట్టిపై విస్తృత పరిశోధనలు చేపట్టిన అధ్యయనకారులు ఈ నిర్ణయానికి వచ్చారు. చంద్రుడి వయస్సు 10 కోట్ల సంవత్సరాలు అని, అలాగే సౌర వ్యవస్థ ఏర్పాటు తర్వాత 20 సంవత్సరాల లోపల చంద్రగ్రహం ఆవిర్భవించిందని గత అంచనాలన్నీ తప్పు అనే అభిప్రాయాన్ని సోమవారం కాలిఫోర్నియా వర్సిటీ పరిశోధకుడు మెలానీ బార్బోని వెల్లడించారు. 450 కోట్ల క్రితం భూమి నుంచి విడిపోయిన శకలాలతో చంద్రుడు ఏర్పడినట్టు పరిశోధకులు పేర్కొన్నారు.

LEAVE A REPLY