చంద్రబాబుకు వూరట

0
21

ఓటుకు నోటు కేసులో ఏసీబీ కోర్టు ఆదేశాల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హైకోర్టులో వూరట లభించింది. చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేపట్టాలని అవినీతి నిరోధకశాఖ పోలీసులను ఆదేశిస్తూ హైదరాబాద్‌లోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఈ ఏడాది ఆగస్టు 29న జారీచేసిన ఉత్తర్వులను కొట్టేసింది. చంద్రబాబు పాత్రపై దర్యాప్తు నిర్వహించాలని కోరుతూ వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టును ఆశ్రయించడానికి అర్హతే లేదంది. ఏసీబీ న్యాయస్థానం ఉత్తర్వులతో.. ఒక ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయిన కేసులో మరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిన పరిస్థితులు తలెత్తాయంది. ఒక కేసు వ్యవహారంలో రెండు ఎఫ్‌ఐఆర్‌ల నమోదుకు చట్ట నిబంధనలు విరుద్ధమంది.

LEAVE A REPLY