చంద్రబాబుకు చెప్పిన కేసీఆర్‌!

0
20

నోట్ల రద్దు నిర్ణయానికి దారితీసిన కారణాలపై ప్రధాని మోదీ తన వద్ద మనసు విప్పారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పారు. మంగళవారం రాత్రి వారిద్దరూ హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌ ఆవరణలో కాసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ గౌరవార్థం గవర్నర్‌ నరసింహన్‌ ఇచ్చిన విందుకు ఈ ఇద్దరు సీఎంలు హాజరయ్యారు. తన వద్దకు వచ్చిన అతిధులను పలకరించి వారితో ఫొటోలు దిగే పనిలో రాష్ట్రపతి ఉండటంతో ముఖ్యమంత్రులు ఇద్దరూ కొద్దిగా పక్కకు వచ్చి లోకాభిరామాయణం మాట్లాడుకొన్నారు. 20 నిమిషాల పాటు ఇద్దరూ నిలబడే కబుర్లు చెప్పుకొన్నారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయ వారిద్దరి మధ్యలో ఉండి శ్రోతలా వింటూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ డాక్టర్‌ కోడెల శివ ప్రసాదరావు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జానారెడ్డి తలా కొంతసేపు వారి వద్ద ఉన్నారు.

LEAVE A REPLY