ఘనంగా బీటింగ్ రిట్రీట్

0
18

శ్రావ్యమైన సంగీతం, సంగీతానికనుగుణంగా సైనికుల అభినయం, ప్రేక్షకుల చప్పట్లు.. వెరసి గణతంత్ర వేడుకల ముగింపు ఉత్సవం బీటింగ్ రిట్రీట్ ఆదివారం సాయంత్రం ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఘనంగా జరిగింది. వివిధ బెటాలియన్లకు చెందిన 16 మిలిటరీ బ్యాండ్లు, 16 పైప్, డ్రమ్ బ్యాండ్లు వీనుల విందైన సంగీతంతో వీక్షకులను మైమరిపించాయి. సైన్యంతోపాటు, నావికాదళం, వైమానిక దళానికి చెందిన సిబ్బంది వివిధ రకాల వాయిద్యాలతో పలికించిన పలు గీతాలు ఆహ్లాదపరిచాయి. సర్వసైన్యాధ్యక్షుడైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంప్రదాయ గుర్రపు బగ్గీలో ఆయన విజయ్ చౌక్‌కు చేరుకోగానే ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ,ప్రధాని మోదీస్పీకర్ సుమిత్రా మహాజన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY