ఘనంగా ప్రారంభమైన ఫుట్‌బాల్‌ వరల్డ్‌కప్‌

0
5

ఆతిథ్య రష్యా ప్రపంచకప్‌ సాకర్‌లో ఘనమైన బోణీ కొట్టింది. గురువారం జరిగిన గ్రూప్‌-ఎ తొలి మ్యాచ్‌లో ఇగార్‌ అకిన్‌ఫీవ్‌ సారథ్యంలోని రష్యా ఏకంగా 5-0 స్కోరుతో సౌదీ అరేయాను ఓడించింది. తద్వారా వరల్డ్‌కప్‌ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు విజయం సాధించే పరంపరను కొనసాగించింది. వేలాదిమంది అభిమానులు, దేశాధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ఉత్సాహ పరిచిన వేళ రష్యా అమోఘమైన ఆటతీరు కనబరిచింది. యూరీ గజిన్‌స్కీ (12వ నిమిషం), డెనిస్‌ చెరిషేవ్‌ (43, 90), అర్టెమ్‌ జ్యూబా (71వ), అలెగ్జాండ్‌ గొలోవిన్‌ (90) రష్యాకు గోల్స్‌ అందించారు. మ్యాచ్‌ రెండో నిమిషంలోనే గోల్‌ చేసేందుకు రష్యాకు లభించిన అవకాశాన్ని సౌదీ డిఫెండర్లు సమర్థంగా అడ్డుకొన్నారు. ప్రారంభంలో ఇరు జట్లు బంతిని ఆధీనంలో ఉంచుకొనేందుకు బాగా కష్టపడాల్సి వచ్చింది. మరోవైపు కుడి, ఎడమ వైపులనుంచి రష్యా చేసిన దాడులను చక్కగా అడ్డుకొన్న సౌదీ డిఫెండర్లు ప్రత్యర్థి జట్టు రెండు గోల్స్‌ అవకాశాలను వమ్ము చేశారు.

LEAVE A REPLY