ఘట్టమనేని, అక్కినేని ఉగాదిరోజు నిజంగా పండుగ

0
20

ఘట్టమనేని, అక్కినేని అభిమానులు ఈ ఉగాదిరోజు నిజంగా పండుగను నిర్వహించుకోనున్నారు. మహేశ్‌-మురుగదాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ను ఉగాదికి ప్రకటించనున్నట్టు ఈ మధ్య మహేశ్‌ స్వయంగా వెల్లడించారు. చిత్రానికి ‘స్పైడర్‌’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉంది. అక్కినేని నాగచైతన్య హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫేమ్‌ కళ్యాణకృష్ణ తెరకెక్కిస్తున్న చిత్రానికి ‘రారండోయ్‌ వేడుక చూద్దాం’ అనే పేరు పరిశీలనలో ఉంది. దీన్నే ఖాయం చేస్తారో? కొత్తదాన్ని ప్రకటిస్తారో తెలుసుకోవాలంటే ఉగాది వరకు వేచి చూడాల్సిందే. తమ అభిమాన హీరోల చిత్రాలకు సంబంధించిన ఫస్ట్‌లుక్స్‌ కోసం ఫ్యాన్స్‌ వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ రెండు చిత్రాల్లోనూ నాయిక రకుల్‌ ప్రీత్ సింగ్‌ కథానాయిక.

LEAVE A REPLY