గ‌వ‌ర్న‌ర్ కోసం శ‌శిక‌ళ ఎదురుచూపులు

0
35

త‌మిళ‌నాడు సీఎంగా శ‌శిక‌ళ ఎప్పుడు ప్ర‌మాణ స్వీకారం చేస్తారో సందిగ్ధంగా మారింది. ఆ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు సోమ‌వారం ఢిల్లీలో ఉన్నారు. సీఎం ప‌న్నీరు సెల్వం రాజీనామాను ఆమోదించిన గ‌వ‌ర్న‌ర్ ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేసేంత వ‌ర‌కు ఆ ప‌ద‌విలో ఆయ‌న్నే కొన‌సాగమన్నారు. మ‌రోవైపు సోమ‌వారమే మ‌ద్రాసు వ‌ర్సీటీలో శ‌శిక‌ళ ప్ర‌మాణం స్వీకారం కోసం ఏర్పాట్లు జోరుగా సాగాయి. అన్నాడీఎంకే ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న వీకే శ‌శిక‌ళ వాస్త‌వానికి ఇవాళ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయాల్సి ఉంది. అయితే ఆమె ప్ర‌మాణ స్వీకారం ఎప్పుడు ఉంటుందో ఇప్పుడే చెప్ప‌లేమ‌ని అధికార వ‌ర్గాల ద్వారా తెలుస్తున్న‌ది. గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రాష్ట్రంలో లేర‌ని, ఆయ‌న టూర్ షెడ్యూల్ త‌మ ద‌గ్గ‌ర లేద‌ని రాజ్‌భ‌వ‌న్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గ‌వ‌ర్న‌ర్ అందుబాటులో లేని కార‌ణంగా శ‌శిక‌ళ ప్ర‌మాణ స్వీకారం వాయిదాప‌డ‌నున్న‌ది. మ‌రోవైపు డీఎంకే నేత స్టాలిన్ రేపు త‌మిళ‌నాడు రాజ‌కీయ సంక్షోభంపై రాష్ట్ర‌ప‌తి, ప్ర‌ధానితో భేటీకానున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాల‌ని ఆయ‌న డిమాండ్ చేయ‌నున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here