గ్రామాభివృద్దిలో భాగస్వాముల ప్రమేయం పెంచాలి

0
24
గ్రామాభివృద్దిలో భాగస్వాముల ప్రమేయం పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలతో నీరు-ప్రగతి పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రెండేళ్లలో గ్రామాల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ శాచురేషన్ స్థాయికి పెంచేలా చూడాలన్నారు. మా ఊరు అనే భావం అందరిలో పెంపొందాలన్నారు. గ్రామాభివృద్ధిలో భాగస్వాముల ప్రమేయం పెంచాలన్నారు. కేంద్రం నుంచి మరో రూ.2,500 కోట్లు రానున్నాయని, వాటితో మరుగుదొడ్ల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. పంట కాలువలు, డ్రెయిన్ల మరమ్మత్తులు సకాలంలో పూర్తిచేయాలన్నారు.
మహిళా సంఘాలు, సాగునీటి సంఘాలు, జన్మభూమి కమిటీలను భాగస్వాములను చేయాలన్నారు. మనపై నమ్మకం వల్లే పెట్టుబడులు వస్తున్నాయి, ప్రజలు సహకరిస్తున్నారు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here