గౌతమ్‌సవాంగ్‌ తీవ్ర మనస్తాపం

0
9

విజయవాడ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ గౌతమ్‌ సవాంగ్‌ తీవ్ర మనస్తాపం చెందినట్లు తెలుస్తోంది. రాష్ట్ర డీజీపీ పదవి వస్తుందని ఆశించిన ఆయనకు భంగపాటు ఎదురైన విషయం తెలిసిందే. కొత్త డీజీపీగా ఠాకూర్‌ నియమితులయ్యారు. అప్పటినుంచి సవాంగ్‌ విధులకు దూరంగా ఉంటున్నారు.

డీజీపీగా ఠాకూర్‌ బాధ్యతలు తీసుకునే కార్యక్రమానికి సైతం ఆయన హాజరు కాలేదు. సోమవారం హోంగార్డుల ఆత్మీయ సమ్మేళనానికి సైతం సవాంగ్‌ గైర్హాజరయ్యారు. డీజీపీ నియామకంపై సీఎం చంద్రబాబు పిలిచి మాట్లాటకపోవడంపై సవాంగ్‌ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది

LEAVE A REPLY