గౌతమిపుత్రుడి మహారుద్రాభిషేకం

0
31

బాలకృష్ణ నటిస్తున్న వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి. క్రిష్ దర్శకుడు. జాగర్లమూడి సాయిబాబు, వై.రాజీవ్‌రెడ్డి నిర్మాతలు. సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకురానుంది. ఈ సినిమా విజయాన్ని కాంక్షిస్తూ దేశంలోని 1116 శివాలయాల్లో బాలకృష్ణ అభిమానులు మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ వేడుక సోమవారం హైదరాబాద్ ఫిలిం నగర్ దైవ సన్నిధానంలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ఈ బృహత్ కార్యక్రమాన్ని చేపట్టడం దైవ సంకల్పంగా భావిస్తున్నాను. తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గౌతమిపుత్ర శాతకర్ణి చరిత్ర కొద్ది మందికే తెలుసు. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రజలందరూ ఆ మహా చక్రవర్తి చరిత్రను తెలుసుకునే అవకాశం కలుగుతుంది. గౌతమిపుత్ర శాతకర్ణి తల్లిగారు కరీంనగర్ జిల్లాలోని కోటిలింగాల ప్రాంతంలో జన్మించారు. ఆమె తనయుడైన శాతకర్ణి కోటిలింగాలతో పాటు అమరావతిని రాజధానిగా చేసుకొని అఖండ భారతావనిని పరిపాలించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here