గోవా సీఎం మనోహర్ పారికర్

0
25

కేంద్ర మాజీ మంత్రి మనోహర్ పారికర్ మళ్లీ గోవా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయనను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గవర్నర్ మృదులా సిన్హా ఆదివారం ఆహ్వానించారు. ప్రమాణ స్వీకారం చేసిన 15 రోజుల్లోగా మెజారిటీ నిరూపించు కోవాలని ఆదేశించారు. అంతకుముందు మనోహర్ పారికర్, బీజేపీ ఎమ్మెల్యేలు ఆదివారం సాయత్రం గవర్నర్ మృదులా సిన్హాను కలిశారు. తమకు జీఎంపీ, జీఎఫ్‌పీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్రులతోపాటు ఎన్సీపీ ఎమ్మెల్యే సహా మొత్తం 22మంది మద్దతు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయా ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖను పారికర్ గవర్నర్‌కు అందజేశారు. ఈ నేపథ్యంలో గోవాలో పెద్దపార్టీగా కాంగ్రెస్ అవతరించినా దానికి అధికార పీఠం అందని ద్రాక్షగానే మిగిలింది. ఎన్నికల ఫలితాల్లో ఏ పార్టీకి ప్రభుత్వం ఏర్పాటుకు సరిపడామెజారిటీ రాకపోవడంతో పొత్తులు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో గోవా ఫార్వర్డ్ పార్టీ, స్వతంత్రులతో కాంగ్రెస్ సంప్రదింపులు జరుపుతుండగానే.. గోవా మాజీ సీఎం, ప్రస్తుత రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను తెరపైకి తెచ్చిన బీజేపీ..కాంగ్రెస్ అంచనాలను తల్లకిందులు చేసింది. పారికర్‌ను సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో మూడు చొప్పున సీట్లు కైవసం చేసుకున్న మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ (జీఎంపీ), గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ), స్వతంత్ర అభ్యర్థి గోవింద్ గవాడే సైతం పారికర్ నాయకత్వాన్ని సమర్థించారు. కేంద్ర మంత్రి, బీజేపీ గోవా ఎన్నికల ఇన్‌చార్జీ నితిన్ గడ్కరీ ఇప్పటికే పనాజీలో మకాం వేసి పొత్తులపై సమీక్షలు జరిపారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here