గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నూతన తెలంగాణ

0
18

గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా నూతన తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ పూర్వ వైభవాన్ని తిరిగి నెలకొల్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ యూనివర్సిటీ వీసీ, అధికారులకు నిర్దేశించారు. ఓయూ శతాబ్ధి ఉత్సవాలపై రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లతో ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రపంచంలో గొప్ప విశ్వ విద్యాలయంగా వెలుగొందిన ఓయూ తన వైభవం కోల్పోవడం దురదృష్టకరమన్నారు. ఓయూ చారిత్రక ఘనతను తిరిగి నెలకొల్పేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడమని సీఎం పునరుద్ఘాటించారు. అన్ని వర్సిటీల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు

LEAVE A REPLY